సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం దేవాలయంలో 28 రోజు అయిన ఆదివారం ధనుర్మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో గోదాదేవి రచించిన పాశురాలను వెంకటేశ్వర స్వామి ముందు చదివారు. గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు.