సంగారెడ్డి: ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

63చూసినవారు
సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ స్వామి గౌడ్, సంతోష్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శబరిమలలో జరిగే విధంగా తాంత్రిక రీతిలో స్వామివారి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. జంగి రెడ్డి భజన బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, శంకర్ పల్లి నుంచి గురుస్వాములు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్