సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని పురాతన దాస్తాంజనేయ దేవాలయంలో శనివారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసా ను చదివారు. హనుమంతునికి సింధూర సహిత పూజా కార్యక్రమాన్ని జరిపించారు. మహా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నాడు.