సంగారెడ్డి: విద్యాపీఠంలో జ్వాలాతోరణ మహోత్సవ వేడుకలు

59చూసినవారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జ్వాలాతోరణం మహోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వరి శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు జ్వాలాతోరణం కింద నుంచి మూడుసార్లు నడుచుకుంటూ వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్