సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలోని అయ్యప్ప దేవాలయంలో కార్తిక బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమానికి మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.