సంగారెడ్డి: గిరిజన నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

60చూసినవారు
చలో లగచర్ల కార్యక్రమానికి బయలుదేరిన గిరిజన నాయకులను సంగారెడ్డి పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్ తో పాటు సంఘం నాయకులను సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. జైపాల్ నాయక్ మాట్లాడుతూ శాంతియుతంగా లగచర్లకు బయలుదేరిన తమను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్