సంగారెడ్డి పట్టణం శ్రీ సహాస్రార్జున క్షత్రియ సమాజ్ ఆద్వర్యంలో శ్రీ వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ సహాస్రార్జున క్షత్రియ సమాజ్ భవనంలో శుక్రవారం సుమారు రెండు వందల మంది సువాసినీ మహిళలు వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వరలక్ష్మీ వ్రత క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు.