హత్నూర మండలం పరిధిలోని ఎల్లమ్మ గూడా గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ఏర్పాటుకు ఎస్ ఆర్ ట్రస్ట్ అధినేత గోదావరి అంజిరెడ్డి మంగళవారం లక్ష రూపాయల విరాళం గ్రామ పెద్దలకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల ఏర్పాటుకు ఆయన వంతుగా కృషిచేసిన లక్ష రూపాయల విరాళంగా అందించిన గోదావరి అంజిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.