రేపటి నుండి శ్రీ శ్రీ శ్రీ బసవలింగప్ప స్వామి వారి ఆలయ వార్షికోత్సవం

373చూసినవారు
రేపటి నుండి శ్రీ శ్రీ శ్రీ బసవలింగప్ప స్వామి వారి ఆలయ వార్షికోత్సవం
ఝరాసంగం సంఘం మండల పరిధిలోని ప్యాలవరం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ బసవలింగప్ప స్వామి వారి షష్టమ వార్షికోత్సవ సందర్భంగా మంగళ వారం నాడు గురువందనం , గణపతి పూజ, పుణ్యవాచనం, నవ గ్రహ ఆహ్వానం, కలశ స్థాపన, అవాహిత దేవతా పూజ, గణపతి హోమం, రుద్ర హోమం, రాత్రి భజన కార్యక్రమం జరుపబడును. బుదవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. కావున భక్త జనులందరూ అధిక సంఖ్యలో పాల్గొని తన మన దనములచే సహకరించి స్వామి వారి కృప కు పాత్రులు కాగలరని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్