కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

1395చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం లోని ఆత్మకూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈ రోజు గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, జిల్లా ఎస్ పి అదనపు కలెక్టర్ లతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు కంటి పరీక్షలు చేసుకొని అంధత్వం రాకుండా జాగ్రత్త గా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో సదాశివపేట మండల జెడ్పీటీసీ, ఎం పీ పీ, గ్రామ సర్పంచ్ గంగన్న, ఎం పీ టీ సీ సత్యనారాయణ, రైతు బంధు మండల కోఆర్డనేటర్ అమరేందర్ రెడ్డి , గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వైద్యాధికారి, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్