రేపటి నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం

355చూసినవారు
రేపటి నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామ పంచాయతీ పరిధి లో మంగళవారం(నిన్నటి) నుండి గ్రామ ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి కంటి వెలుగు ఆహ్వాన పత్రాలను అంజేస్తున్నరు. రాష్ట్రంలో పూర్తి అంధత్వాన్ని నిర్మూలించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కే సీ ఆర్ ఈ రోజు(బుధవారం) ఖమ్మం లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపటి నుండి ఎం పీ, లు, ఎం ఎల్ ఏ లు, ప్రభుత్వ అధికారులు, ఎం పీ టీ సీ, సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామ ప్రజలందరి భాగస్వామ్యం తో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతీ రోజు 300 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి తగిన మందులు, కంటి అద్దాలు, ఉచిత కంటి ఆపరేషన్ లు చేస్తారని ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్