క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమే.

1876చూసినవారు
క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమే.
సంక్రాంతి పర్వదినంగా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రామంలో గ్రామీణ క్రీడా పోటీలు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు.

ఈ క్రీడా పోటీల్లో విజేతలకు గ్రామ ఉప సర్పంచ్ వనజా వీరేశం చేతులమీదుగా వారి కుమారుడైన వీరేశం తండ్రి క్రీస్తు శేషులు మంగలి భాగయ్య జ్ఞాపకార్థం బహుమతులను విజేతలకు అందజేసినట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ వెంకట స్వామి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమేనని ఉన్నారు. గ్రామీణ క్రీడలను ఆల్ ఇండియా సమతా సైనికులు ఆధ్వర్యంలో నిర్వహించడం వారికి బహుమతులను యువ నాయకుడు మంగలి వీరేశం వారి తండ్రి క్రీస్తు శేషులు మంగలి భాగయ్య జ్ఞాపకార్థం విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి రామ్రెడ్డి లింగారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్