టేక్మాల్: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో ముకేశ్ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ మాదేపూర్ జిల్లాకు చెందిన ముకేశ్ పని నిమిత్తం వచ్చాడు. శనివారం ఉదయం అతడి భార్యతో ఫోన్లో గొడవపడి తోటి పని వాళ్లతో చెప్పకుండా వెళ్లిపోయాడు. సున్నంగుట్ట అడవిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బావమరిది ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.