జహీరాబాద్ పట్టణంలోని ఓ హోటల్ లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. న్యాల్కల్ జిల్లా పరిషత్ హైస్కూల్ 2005-2006 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులందరూ సమావేశమై తమ అనుభవాలను పంచుకున్నారు. అదే విధంగా చదువు, సంస్కారాలను నేర్పిన అధ్యాపకులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.