ఝరాసంఘం మండలం తుమ్మన్ పల్లి గ్రామానికి చెందిన హన్మంత్ రెడ్డికి రూ. 60, 000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదల అయిన చెక్కులను శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం చేతుల మీదుగా గురువారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పండరినాత్, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ సర్పంచ్, ఫోరమ్ అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్, పట్టణ అధ్యక్షులు ఈజాస్ బాబా, తదితరులు పాల్గొన్నారు.