రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోహీర్ ఎస్‌ఐ గోపతి సతీష్ పేర్కొన్నారు. బుధవారం కోహీర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె. ప్రసాద్ రెడ్డి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వేగ నియంత్రణ డ్రమ్స్ పరికరాలను కోహీర్ ఎస్‌ఐకి అందజేశారు.