జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లాస్ రూమ్లకు ఒక్క డోరు కూడా లేదు. మన ఊరు మన బడి కింద వచ్చిన బెంచెస్ ఖరాబ్ అవుతున్నాయి. స్కూల్ చుట్టూ ఉన్న బోండ్రి అక్కడక్కడ కూలిపోయింది. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.