పేదలకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగడం లేదని ధర్మసమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేందర్ మహారాజ్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాంపూర్ లో ఓ దళితుడు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదుకు వెళ్తే కానిస్టేబుల్ కొట్టి అవమానపరిచి కేసు పెట్టకుండా చేయడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. కిషన్ మృతికి కారణమైన పోలీసులను వెంటనే ఉద్యోగం నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.