అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్ ఎన్నికల్లో డెలవేర్‌లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి జాన్ వేలెన్ 3పై సారా మెక్‌బ్రైడ్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.