TG: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఎన్నికలపై కీలక అప్ డేట్ అందుతోంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్, పదో తరగతి వార్షిక, ప్రవేశ పరీక్షల దృష్ట్యా మరో నాలుగైదు నెలల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చేనెలలో బీసీ డెడికేటెడ్ కమిషన్ అందించే నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అందుతోంది.