తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పబడుతూ సనాతన ధర్మాన్ని అవమానపరిచారని హింధూ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే అత్యున్నత ధర్మాసనం వాటిని విచారించడానికి నిరాకరించింది.