భారత దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని అన్ని కాలాల వ్యవధిలో 10 బేసిస్ పాయింట్లు పెంచింది. MCLR అనేది ఒక ఆర్థిక సంస్థ రుణం ఇచ్చే కనీస వడ్డీ రేటు. ఈ నిబంధన ఆగష్టు 15 నుంచి అమల్లోకి వస్తుంది. కాగా, SBI MCLR మూడు సంవత్సరాల కాలవ్యవధికి 9.10%, రెండు సంవత్సరాల కాల వ్యవధి 9.05%, ఒక సంవత్సర కాల వ్యవధికి 8.95%గా ఉంది.