ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ యువకుడిని కారు ఢీకొట్టి, అతడిని బ్యానెట్‌పై చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లింది. యూపీలోని మొరాదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మొత్తం సంఘటన హైవేపై జరిగింది. ఆ కారు పక్కనే వెళుతున్న మరో కారులోని వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు. కాగా, అదృష్టవశాత్తు యువకుడు ప్రాణాలతో బయట పడ్డాడు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.