మినుము సాగు చేసే రైతులు ఎదుర్కొనే సమస్యల్లో విత్తన శుద్ధి ప్రధానమైంది. కారణమేంటంటే మినుము పంటలో తెల్ల దోమ,పేనుబంక, తామర పురుగుల సమస్య అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరి. దీని కోసం కిలో విత్తనానికి 5 గ్రా.థయోమిథాక్సమ్ 5మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్.మందుతో విత్తనశుద్ధి చేసుకుంటే చీడపీడల బెడద ఉండదు. అలాగే ట్రైకోడెర్మా విరిడిని కిలో విత్తనానికి 10గ్రా.చొప్పున కలిపి విత్తుకోవడం మంచిది.