ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అన్నారు. ‘‘ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు.. రూ.32 కోట్లు విలువైన కంపెనీ స్థిరాస్తి. షేర్ల బదలాయింపులపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు. ఈడీ అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదం’’ అని షర్మిల పేర్కొన్నారు.