కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామంలో టీడీపీ నేత గురివిరెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. తన పొలం నుంచి ఇసుక రవాణా చేయకూడదని చెప్పడంతో వివాదం నెలకొంది. మాటా మాటా పెరగడంతో గురివిరెడ్డిపై ప్రదీప్, మరో నలుగురు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఇవాళ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయనను పరామర్శించారు.