చేపల మృతిపై సమగ్ర విచారణ జరపాలి
బెజ్జంకి మండల కేంద్రంలో చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని.. రాష్ట్రముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో అక్కరవేణి పోచయ్యకు చెందిన చేపల చెరువులపై విష ప్రయోగం వలన చేపలు చనిపోగా విషయం తెలిసిన జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘం సభ్యులతో కలసి పరిశీలించి చేపల రైతు పోచయ్యను పరామర్శించారు.