దుబ్బాకలో ఈనెల 13 మంగళవారం నుంచి 18 ఆదివారం వరకు దుబ్బాకలో శ్రీ బాలాజీ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో దుబ్బాక బాలాజీ దేవాలయ కమిటీ సభ్యులు అర్చకులు కలిసి ఎమ్మెల్యేని కరపత్రం ఇచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉన్నారు.