సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట గాంధీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనేక చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు.