విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మిరుదొడ్డి క్రీడా పోటీలను ఎస్సీ, ఎస్టీ కమిటీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య జ్యోతి ప్రజ్వలన చేసి సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.