బీఆర్ఎస్ లో మహిళలను గౌరవించే సంస్కృతి లేదని కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. దుబ్బాకలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ పై అసభ్యకర పోస్టులు పెట్టడం సరికాదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.