భూంపల్లి: విద్యుత్ షాక్ తో మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించిన ఫకీర్ పాషా కుటుంబాన్ని బుధవారం మిరుదొడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లింగాల వెంకట్ రెడ్డి పరామర్శించి 50 కిలోల బియ్యం, ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరమైన నర్సింలు, మాజీ ఎంపీటీసీ ఎల్లేషం, తదితరులు పాల్గొన్నారు.