గజ్వేల్ కు చెందిన కేతోజి నవ్య డెలివరీ కోసం మెడిసిటి ఆసుపత్రిలో చేరగా ఆమెను పరీక్షించిన వైద్యురాలు రక్తం తక్కువ ఉన్నదని, బ్లడ్ గ్రూప్ అరుదైన ఓ నెగిటివ్ అని చెప్పగా అత్యవసరంగా బ్లడ్ ఎక్కించవలసిందిగా తెలియజేశారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఆర్ఎంపీ హరికెల కరుణాకర్ స్పందించి వెంటనే మెడిసిటి ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి 18వ సారి రక్తదానం చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కరుణాకర్ ను అభినందించారు.