జగదేవపూర్ గణపతి లడ్డూ రూ.1,25,001

84చూసినవారు
జగదేవపూర్ గణపతి లడ్డూ రూ.1,25,001
జగదేవపూర్ మండల కేంద్రంలోని శివాలయంలో గణపతి నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం గణపతి శోభాయాత్రలో భాగంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు.వేలం పాటలో 1, 25, 001 రూపాయలకు ఇట్టి రెడ్డి సులోచన-రఘుపతి రెడ్డి కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. రికార్డు ధరలో గణపతి లడ్డూ కైవసం చేసుకున్న సులోచన రఘుపతి దంపతులకు గణపతి అనుగ్రహం ఉండాలని శివాలయం గణపతి మండప నిర్వాహకులు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్