Feb 22, 2025, 08:02 IST/
కన్నీళ్లు పెట్టుకున్న గ్రూప్-2 అభ్యర్థి (వీడియో)
Feb 22, 2025, 08:02 IST
AP: రోస్టర్ విధానంలో తప్పులను సరి చేసే వరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని హైదరాబాద్లో అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, APPSC చైర్మన్ ఎందుకు స్పందించడం లేదని ఓ మహిళా అభ్యర్థి ప్రశ్నించారు. 2024లో తాను జనసేనకు ఓటు వేశానని, ఇప్పుడు పవన్ ఎక్కడికి వెళ్లారో అర్థం కావట్లేదన్నారు. తమ జీవితాలను నాశనం చెయ్యొద్దంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.