ఏపీ ఖజానా అంతా ఖాళీ: మాజీ మంత్రి యనమల

62చూసినవారు
ఏపీ ఖజానా అంతా ఖాళీ: మాజీ మంత్రి యనమల
AP: రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ అయిందని, దానికి తోడు అప్పులు కూడా ఉన్నాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిపారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని, కేంద్రం ఆర్థికసాయం చేయకపోతే కష్టాలు తప్పవని యనమల పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్