AP: ప్రకాశం జిల్లా పామూరు మండలం వగ్గంపల్లిలో విషాదం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన ప్రేమమ్మ (53) మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్య? హత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.