హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు రోడ్ల విస్తరణకు, హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం ఢిల్లీలో గడ్కరిని కలిసి విన్నవించారు. కోహెడ నుంచి దేవక్కపల్లికి, నాగసముద్రాల, అక్కన్నపేట వయా రామవరం నుంచి జనగామ వరకు రోడ్లను విస్తరించేందుకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.