జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలలో వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తనిఖీలు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసే సమయంలో ఈ తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. వీటిలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చూడాలని సూచించారు.