సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ గొడవల కారణంగా సోమవారం రూరల్ పోలీసు స్టేషన్‌కు భార్యభర్తలు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ కూడా మళ్లీ ఇద్దరు గొడవ పడుతుంటే.. వారిని ఆపేందుకు ఓ పోలీసు కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు. వారిని ఆపే ప్రయత్నం చేస్తుండగా.. వారిద్దరూ కానిస్టేబుల్ పైకి సైతం దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్ ఒక్కసారిగా షాకయ్యాడు.