సిక్కోలు ప్రజల కల నిజమైందని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. ‘ఇది సిక్కోలు ప్రజల విజయం. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాను. కేంద్రమంత్రి అయినా నా స్వభావం మారదు. కష్టనష్టాల్లో ఈ జిల్లా ప్రజలు నాకు అండగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తాను’’ అని అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో జరిగిన ఆత్మీయ అభినందన సభలో ఈ మేరకు మాట్లాడారు.