బోయినపల్లి మండలం స్తంభంపెల్లి గంజివాగు వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారి భారీ వర్షాల కారణంగా పూర్తిస్థాయిలో కొట్టుకుపోవడంతో ఆదివారం రాకపోకలు నిలిపివేశినట్టు వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. భారీ వర్షాలు ఉన్నందున అత్యవసర ఉంటే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.