మల్యాల: భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు అంజన్న క్షేత్రం

56చూసినవారు
మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచే తలనీలాలు సమర్పించుకుని, కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాలతో పాటు, అనుబంధ ఆలయాల్లో సైతం భక్తుల తాకిడి నెలకొంది. కార్తీకమాసం కావడంతో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్