కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. లింగాపూర్ చెరువు, శాలపల్లె, అడపపల్లి, రంగధామునిపల్లి గ్రామాల మధ్య ఉన్న వాగును బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, లింగాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ పూసాల శోభ తిరుపతి పాల్గొన్నారు.