ఎండపల్లి: కులగణన సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో కులగణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని వెల్గటూరు ఎంపీఓ గాజుల శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజారాంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎండపల్లి మండల పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుంటుంబ సర్వేలో అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు.