ధర్మపురి: గోదావరి తీరాన కార్తీక సందడి
జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్య క్షేత్రంలో సోమవారం కార్తీక సందడి నెలకొంది. మహిళలు గోదావరి నదిలో స్నానాలు చేసి దీపాలు వదిలి పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా కార్తీక మాసంలో గోదావరి నదిలో దీపాలు వదిలి పెడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శివునికి ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని భక్తులు పవిత్ర మాసంగా భావిస్తారు.