ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

847చూసినవారు
ఎయిడ్స్ పై అవగాహన సదస్సు
హుజురాబాద్ పట్టణంలో శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే గురువారం ఎయిడ్స్ డే ను పురస్కరించుకొని ఎయిడ్స్ దిష్టిబొమ్మను కళాశాల ప్రాంగణం నుండి ప్రధాన దారుల గుండా నినాదాలతో అంబేద్కర్ వద్దకు వచ్చి ఎయిడ్స్ భూతాన్ని దహనం చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మేకల నవీన్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని ఎయిడ్స్ సోకిన వ్యక్తిని ప్రేమగా ఆదరించాలని వ్యక్తిని గౌరవించాలని ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ నిర్మూలనపై చక్కటి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలి వద్ద ఎయిడ్స్ భూతాన్ని దహనం చేసి కార్యక్రమాన్ని ముగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్