రాయికల్ పట్టణంలో పిచ్చికుక్కలు స్వైర విహారం

53చూసినవారు
రాయికల్ పట్టణంలో శుక్రవారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో కుక్కలు స్వైర విహారం చేయడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక బస్టాండు, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనదారులపై దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో వాహనదారులు అదుపు తప్పి కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్