కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మానేరు వాగు పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా హన్మకొండ పట్టణానికి ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు గురువారం కమలాపూర్ పోలీసులు వెంబడించారు. తప్పించుకునే ప్రయత్నంలో అంబాల బస్టాండ్ సెంటర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. కాగా మరో రెండు ట్రాక్టర్లు పట్టుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.