మానకొండూరు: ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం
మానకొండూరు మండల కేంద్రంలో ఆదివారం ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యావేత్త యాదగిరి శేఖర్ రావు హాజరయ్యారు. పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరిగి మంచిగా రాణించాలంటే టీచర్ల పాత్ర ఎంత ఉందో తల్లిదండ్రుల పాత్ర అంతే ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. పిల్లలకు సామాజిక జ్ఞానం కల్పించాలని కోరారు.